గుంటూరు కారం
డై రెక్టర్ :త్రివిక్రమ్ శ్రీనివాస్
రైటర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రో డ్యూసర్ : యస్ . రాధా కృష్ణ
సంగీత దర్శకులు: తమన్ ఎస్
ఎడిటింగ్: నవీన్ నూలి
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మరియు తదితరులు
మహేష్ బాబు హీరోగా శ్రీలీల
మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా
గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం
ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
టూకీగా స్టొరీ :
రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో
జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి
వెళ్ళిపోతుంది. దూరంగా పెరిగిన రమణను మళ్ళీ పాతికేళ్ల తర్వాత తాత(ప్రకాష్ రాజ్) పిలిపిస్తాడు. అసలు వసుంధర
ఎందుకు తన కొడుకుని దూరం పెట్టింది ?,
రమణ తండ్రి సత్యం (జయరామ్) పాత్ర ఏమిటి ?, ఈ దూరానికి
కారణం ఎవరు ?,రమణ మళ్ళీ తన
తల్లిని చేరుకున్నాడా ఈ మధ్యలో ఆముక్తమాల్యద (శ్రీలీల) తో రమణ ప్రేమ కథ ఎలా
సాగింది ?,చివరికి
రమణ తన తల్లికి దగ్గర
అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ఎక్కువ మార్కులు :
భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం యాక్షన్ తోనూ కొంచెం కామెడి తో ఇటు నవ్విస్తూనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు కోరుకున్న యాక్షన్ సీన్లతో మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. పైగా తన డైలాగ్ పంచులతో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. త్రివిక్రమ్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. మహేష్ బాబు డై లాగ్ : తుమ్మితే పాపా ఇంకా (శ్రిలీల )ఎర్రబడి పోతుంది . ఇక ఆముక్తమాల్యద(శ్రీ లీల డై లాగ్ ) : నాన్న గారి తద్దినం (జన్మదినం ) కు తేడా తెలియదు . మరోక డైలాగ్ ఇంటికోచిన మనవడితో : (ప్రకాష్ రాజ్) మొన్న ఆఫీస్ కి వచ్చినప్పుడు నాలుగు పికి లోపలవేసి ఉంటె (రమణ ) ఏంటి పీకేది నా బొచ్చు అరవకు నాకు వినపడుతుంది ముసలోడివి నీకే వినపడి చావదు. ఎవడ్ర ముసలోడు అంటూ లేవబోతే పడిపోతాడు (మహేష్ బాబు : కాదని ప్రూ చేయటానికి లేసి డ్యాన్స్ చేస్తావేంటి (డైలాగ్) ) . మహేష్ – శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు కథను ఎలివెట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్, మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు, శ్రీలీల నటన పరంగా తన గ్లామర్ పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్ లు. హిరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాత్రకు తగినంతగా బాగానే నటించింది. అలాగే కీలకమైన రమ్యకృష్ణ రోల్ పాత్రకు తగినంతగా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది . విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు తగ్గట్లు ఎమోషన్ ను చాలా బాగా చేసారు. వెన్నెల కిషోర్ తన కామేడి హావభావాలతో కొన్ని చోట్ల నవ్వించాడు. అదేవిధంగా మరోవిలంగా జగపతి బాబు, (అత్తగా )ఈశ్వరి రావు మరియు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.
తక్కువ మార్కులు :
త్రివిక్రమ్ కామెడీసీనులు బాగున్నప్పటికీ..కొన్ని
ఎమోషనల్ ను పండించే సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ ను తీర్చి
దిద్దటంలో మాత్రం పెద్దగా
ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకుని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో
రాణించలేదు. ఇంట్రెస్ట్ గా సాగని కొన్ని సన్నివేశాలు . మరియు మదర్ ట్రాక్ లోని సీన్స్ కూడా
సెంటిమెంట్ ను పండించ లేవు .పైగా సినిమాలో ఉన్న కామెడీని. సినిమా దర్శకుడు కంటిన్యూ
చేసే ఛాన్స్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు
సెకెండ్ హాఫ్ లో ప్రధాన సీక్వెన్స్ లు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి
అంశాలు సినిమాలో మైనస్ మార్కులుగా నిలిచాయి. మొత్తం గా త్రివిక్రమ్ పంచ్ డై లాగ్స్ పేల్చినా .. ఆయన
రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త నిరాశ పరిచింది.
సాంకేతిక పరమైన విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి
వస్తే.. త్రివిక్రమ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో
మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీ సీన్ల తో
చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు తమన్
సమకూర్చిన పాటలు బాగున్నాయి. కుర్చీ మడతపెట్టి పాటలో బాక్గ్రౌండ్ లైటింగ్ తో
విజువల్ గ చూపిస్తే బాగుండు .సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కొంతవరకు బాగుంది.
నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని
సన్నివేశాలన్నీ కథకి అనుకూలంగా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్
బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథను ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే..
సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని
నిర్మించారు.
అభిప్రాయం :‘గుంటూరు కారం’, మహేష్ అభిమానులను
తగినంతగా ఆకట్టుకుంది. ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన
సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది . అలాగే, త్రివిక్రమ్
మార్క్ కామెడీ, మహేష్ బాబు నటన సినిమాకి ప్లస్ అయ్యాయి.కానీ , బలమైన కథవర్షన్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు
మామూలుగా సాగడం, దీనికితోడు నాటకీయ సన్నివేశాలు, అలాగే కొన్ని
చోట్ల కథ స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, మహేశ్ బాబు తన
స్టైలిష్ మాస్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగానే అలరిoచారు. మొత్తంగా ఈ
చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను మాత్రం ఆకట్టుకుంటుంది
