Hanuman
మూవీ లింక్స్: ట్రైలర్
నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య
దర్శకుడు : ప్రశాంత్ వర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి
సంగీత దర్శకులు: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర
ఎడిటింగ్: సాయిబాబు తలారి
మూవీ .....
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరియు దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్రించిన
మంచి భారీ చిత్రం “హను మాన్”ఈ కొత్త ఏడాది
2024 లో మన టాలీవుడ్
నుంచి ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం మల్టీ పుల్ భాష ల్లో భారీ
బుకింగ్స్ నడుమ రిలీజ్ కు వచ్చిన ఈ చిత్రం
అంచనాలు చేరుకుంటుందో లేదో చూడాలి.
టూకీగా
స్టొరీ :
అంజనాద్రి అనే ఓక చిన్న గ్రామం లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తుంటరిగా
తిరిగే కుర్రాడు హనుమంతు(తేజ సజ్జ).అనుకోని కొన్ని పరిస్తితులల్లో (భజరంగ్)
హనుమాన్ శక్తులని పొందుతాడు. ఆతను ఈ శక్తిని ఎలా
పొందగలిగాడు?
అసలు ఆ శక్తి భూమిపై
ఎలా నిక్షిప్తం అయ్యి ఉంది? మరోప్రక్క సౌర్యస్త్ర
ప్రాంతానికి చెందిన మైఖేల్(వినయ్ రాయ్) తన చిన్ననాటి నుంచి సూపర్ హీరోల విషయంలో చాలా
అధ్బుత భావాలతో తాను కూడా ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు.ఆసమయంలో ఈ (హనుమాన్ )
శక్తిగురించి ఎలా తెలుసుకుంటాడు ఆ శక్తి కోసం మైఖేల్ ఎలా వస్తాడు? వస్తే అప్పుడు
యుద్ధం ఎలా ఉంటుంది ? ఈ కథకు భారతదేశ
ఇతిహాసాల కనెక్షన్ ను జోడిస్తే ఎలా ఉంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని
వెండితెరపై చూడాల్సిందే.
ఎక్కువ మార్కులు :
ఈ చిత్రంలో అందరికీ తెలిసిన
అతి పెద్ద మేజర్ ప్లస్ పాయింట్ హనుమంతుడే ఆ ఫ్యాక్టు- ని సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంత గా హైలైట్ చేయాలో అoతలా హైలెట్ చేసి చూపించాడు.
హీరో తేజ సజ్జ అయితే తన పాత్రకి ప్రాణం పెట్టేసాడు. తన రోల్ అవసరమైన ఎమోషన్ ని
చాలా బాధ్యతగా చేసి చూపించాడు అలాగే తన పేస్ లుక్స్ కానీ కామెడీ టైమింగ్ గాని
యాక్షన్ సీన్ మరియు ఎమోషనల్ పెర్ఫెమెన్స్ లతో చాలాబాగా చేసాడు .
ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కూడా
ఈ చిత్రంలో మంచి పాత్ర ను పోషించింది. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్
తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరితో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా పవర్ఫుల్ యాక్షన్(
డైలోగ్స్ ) రోల్ లో కనిపించారు. మంచి డైలాగ్స్ తో మంచి పెర్ఫామెన్స్ ను కనబరిచింది.
మెయిన్ గా తేజతో ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరి పెర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక వీరితో పాటుగా వెర్సటైల్
నటుడు సముద్రఖని తన పాత్రతో అయితే
సినిమాలో ఆశ్చర్యపరుస్తాడు. ఆ రోల్ లో కూడా అతను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా
విలన్ గా వినయ్ రాయ్ కూడా చాల క్లీన్ గా
కనిపిస్తారు. మరియు గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య
వారిపై కామెడీలు ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయీ .
ఇక వీటి అన్నిటిని మించి
సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ చాలా ఉన్నాయి. ఫస్టాఫ్ సెకండాఫ్ లో కూడా
చాలా అద్బుతమైన హై మూమెంట్స్ ప్రేక్షకులను అదరగొడతాయి. ఇక టోటల్ క్లైమాక్స్ సీన్స్
అయితే మరో గ్రాఫికాల్ బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సీన్
లను డెఫినెట్ గా సినిమా టాకీస్ లో బిగ్ స్క్రీన్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిoదే.
తక్కువ
మార్కులు :
మూవీ లో కొన్ని మైనస్
పాయింట్స్ . ఈ చిత్రాన్ని మన తెలుగు సూపర్ హీరోగా ప్రెజెంట్ చేసినప్పటికీ కొన్ని
సీక్వెన్స్ లు కాస్త రెగ్యులర్ గానే అనిపిస్తాయి. మరియు విలన్ పాత్రలో వినయ్
పాత్రని ఇంకా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తే
బాగుండు . అలాగే హీరో పాత్రకు హనుమాన్
మూవీ పేరుకు లింకు ఎక్కడో మిస్ అయీనట్టుగా అనిపిస్తుంది. అలాగే హీరో పాత్రని మరికాస్త డీటెయిల్డ్ గా ప్రెజెంట్
చేయాల్సింది. తన పాత్రతో పాటుగా సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి.ఇంకా
చాలా సీన్స్ ని మరింత బెటర్ గా వి ఎఫ్ ఎక్స్ ని డిజైన్ చేయాల్సింది. ఇంకా సినిమాలో
కొన్ని సీక్వెన్స్ లు మనం ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది.
అలాగే సెకండాఫ్ కూడా కొంచెం స్లోగా సాగి
నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత ఓకే
అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో కొంచెం నాచురాలిటీ మిస్ అయ్యింది.వీటితో
ఒక కంప్లీట్ సూపర్ హీరో సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు.ఓల్డ్ (శ్రీ ఆంజనేయం
మూవీ ని పూర్తిగా బీట్ చేయలేక పోయారు .చివరి కొన్ని నిమిషాలు మంచి సౌండ్ తో బ్యాక్ గ్రౌండ్ గ్రాఫిక్ తో సినిమా హాలులో
విసిల్స్ వేయీ oచినారు.
సాంకేతిక
పరమైన విభాగం :
ఈ చిత్రంలో పెట్టిన బడ్జెట్ కి
చాలా వరకు న్యాయమైన విజువల్స్ కనిపించాయి. ఒక్క వి ఎఫ్ ఎక్స్ మినహా మిగతా అన్ని
క్రాఫ్ట్స్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వి ఎఫ్ ఎక్స్ చాలా నాచురల్ గా
చూపించారు దానికి కొన్ని చోట్ల బడ్జెట్
మూలాన కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు అనిపించినది . శివేంద్ర సినిమాటోగ్రఫి బాగుంది.
భారీ విజువల్స్ ని తాను చూపించారు.
ఇక గౌరీ హరీష్ సంగీతం సినిమాలో
బాగుంది. మెయిన్ గా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి వెన్నుముకగా నిలిచాడు. చిన్న
బడ్జెట్ తో అయీన ఒక లెవెల్లో ఉంది. ఇంకా ఎడిటింగ్, డైలాగ్స్
బాగున్నాయి.
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ
విషయానికి వస్తే తన విజన్ కి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాకపోతే కొన్ని
సీన్స్ ని మనం ఆల్రెడీ చూసినవే చూపించాడు.కానీ ఇక్కడ తాను ప్రస్తుత కాలానికి మన
ఇతిహాసాన్ని జోడించడంలో ఇంకాస్త గ్రాఫిక్ డిజైన్ చేస్తా బాగుండు అనిపించినది .
హనుమాన్ పోర్షన్ ని తాను
ప్రెజెంట్ చేసిన విధానం చూస్తే రానున్న రోజుల్లో తన సినిమాలకి మరింత బడ్జెట్ ఇస్తే
ఇంకా చాల బాగా విజువల్స్ ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఇంకా కొన్ని లాజిక్స్ ని
కరెక్ట్ చేసుకొని యాక్షన్ సీక్వెన్స్ లను మరింత గా ప్రెజెంట్ చేయాల్సింది.
అభిప్రాయం :
ఇక బడ్జెట్ పరంగా చూసినట్టు
అయితే మన తెలుగు నుంచి వచ్చిన ఈ మొదటి సూపర్ హీరో చిత్రం “హను మాన్” పెట్టుకున్న
అంచనాలు రీచ్ అయ్యింది అని చెప్పవచ్చు. మెయిన్ లీడ్ లో ఉన్న నటీనటులు అంతా కూడా
సాలిడ్ పెర్ఫామెన్స్ లు కనబరిచారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్
ఫ్యాక్టర్ గ్రాఫిక్ తో ప్రెజెంట్ చేసిన
విధానం, మన ఇతిహాసాన్ని జోడించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది . కొన్ని
లాజిక్స్ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ని పక్కన పెడితే చిన్న బడ్జెట్ లో ఈ చిత్రం
సంక్రాంతి కానుకగా అందరికీ మంచి ట్రీట్ ఇస్తుందనే అనిపిస్తింది .