Raviteja

 

ఈగల్  మూవీ 


విడుద లైన  తేదీ :  09  ఫిబ్రవరి, 2024

రవితేజ ఆక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ 

నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు

దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని

నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్

సంగీత దర్శకులు: డావ్ జాన్డ్

సినిమాటోగ్రాఫర్‌లు: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి

ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని

 

మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఈగల్. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

ఆక్షన్ మూవీస్ కి  క్రొత్తతనం  లో డైరెక్టర్ (బోయపాటి శ్రీను) కు దగ్గరగా  కార్తీక్ ఘట్టమనేని నిర్మిoచారు

మూవీ నిర్మాణం లో చాలావరకు కార్తీక్ ఘట్టమనేని సక్సెస్స్ అయ్యాడనే చెప్పాలి

 స్టొరీ :

ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ ) విగ్రహాన్నిపెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. ఐతే, జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) అనుకోకుండా ఢిల్లీ లో ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి, ఆ క్లాత్ పండే ఊరికి (తలకోన అటవీ) సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తోంది.(ఈ మూవీ స్టార్ట్ అవుతుంది) దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక ఆఫీసును  తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ, సహదేవ వర్మకి ఆ కాటన్ క్లాత్ కి ఉన్న సంబంధం ఏమిటి ?,  ఈ సహదేవ్ వర్మ ఎవరు ?, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే ఢిల్లీ కదిలి సీబీఐ రంగంలోకి దిగింది ?, అసలు సహదేవ్ భార్య రచన (కావ్య థాపర్)కి ఏమైంది ?, ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు ? అనేది మిగిలిన కథ.

ఎక్కువ మార్కులు  :

ఈగల్అనే పాత్రలో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. కావ్య థాపర్ తో థాపర్ తో సాగిన లవ్ స్టోరీలోనూ ఆకట్టుకున్నాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్రకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే,  యాక్షన్ సీన్స్  లో  మరియు తన ఎమోషనల్  లుక్స్ తో రవితేజ చాలా బాగా నటించాడు

హీరోయిన్ గా కావ్య థాపర్ ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో  భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె నటన ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రతో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా బాగానే నటించాడు. వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.

మూవీ లో కొన్ని కిక్ పాయింట్స్ .

అకుచప్పుడు బట్టి ఆపద ఏమిటో ఉహించ గలను

అందరుసమానమేనని  రాసినోడు  పదిమ౦దిని మారిస్తే , అందరిని సమానంగా చూసినోడు వేయి మందిని మారుస్తాడు

వెలుతురు వెళ్ళే ప్రతిచోటుకు వాడి బుల్లేట్ వెళుతుంది

అడవిలో చెట్లు వేర్ల ద్యారా ఎలా కమ్యునికేట్ చేసు కుంటాయో అలా వుంటుంది వాడి నెట్ వర్క్

సెకండ్ కి 12 రౌండ్స్ తిరిగే ఎగ్జిట్ ఫ్యాన్ నుంచి ఒక్క బుల్లెట్ తో చంపేసాడు  

విధ్వంసం నేను  విధ్వంసంను ఆపే వినాశనం నేను

గేటు లోపలికి వచ్చి నది ప్రతీది నాదే  అది ఆయుధం అయినా ఆయువు అయినా

 తక్కువ మార్కులు  :

ఈగల్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని, అంతే స్థాయిలో ఈ ఈగల్ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.  కొన్ని రొమాన్స్ సన్నివేశాలు మినహా అంతగా  ఫ్రెష్ నెస్ కనిపించదు.

అలాగే, ఫస్ట్ హాఫ్ ను త్రిలింగ్ గా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని మాత్రం కాస్త  సాగతీశారు. ఇంకా  క్లైమాక్స్  కథనంలో ఉత్సుకతను పెంచటంలో కాస్త  విఫలమయ్యారు. క్లైమాక్స్ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, కార్తీక్ ఘట్టమనేని మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన కావ్య థాపర్పాత్ర ను ఇంకా బ్యాక్ గ్రౌండ్  ( సొంత ఊరు తలకోన ) బలంగా ఎస్టాబ్లిష్ చేసి. ఆ పాత్రకి ముగింపు ఇవ్వాల్సింది.

సాంకేతిక పరమైన విభాగం :

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొన్ని సన్నివేశాలను యాక్షన్ థ్రిల్లింగ్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన ఈగల్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.పరవాలేదనే చెప్పాలి. నిర్మాత టి జి విశ్వప్రసాద్ చాలావరకు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 అభిప్రాయం  :

ఈగల్అంటూ భారీ యాక్షన్ అండ్ డ్థ్రిల్లర్ అండ్  ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటన మరియు యాక్షన్ సీన్స్, అలాగే రవితేజ పాత్ర తాలూకు ఎమోషన్స్ చాలావరకు పండించాడు . క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంది. కాని  ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి .

overal---100/90 marks