Vettaiyan Movie Review

 



                                   Vettaiyan Movie  Review


 

నటీనటులు : రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, అభిరామి, దుషారా విజయన్, రోహిణి, రావు రమేష్ తదితరులు

దర్శకుడు : టి.జె. జ్ఞానవేల్

నిర్మాతలు : ఎ. సుభాస్కరన్

సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్. కతీర్

ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్

 తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ,మరియు అమితాబ్ బచ్చన్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్’. దర్శకుడు జ్ఞాన్‌వేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ప్రేక్షకులను  ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి

 స్టొరీ  :

అతియన్ (రజినీకాంత్) సూపరింటెండ్  ఆఫ్ పోలీస్  ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. అన్యాయం జరిగితే, ఆ అన్యాయం హద్దులు దాటిపోయింది అనిపిస్తే ఎన్ కౌంటర్ చేసైనా న్యాయం చేయాలని భావించే వ్యక్తి అతియన్. అలాంటి అతియన్ కి ఓ సమస్య ద్వారా స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్)  పరిచయం అవుతుంది. అన్యాయం పట్ల ఆమె చూపించిన ధైర్యానికి అతియన్ మెచ్చుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. స్కూల్ టీచర్ శరణ్య అతి దారుణంగా చంపబడుతుంది. అసలు ఆమెను చంపిన వ్యక్తి ఎవరు ? ఈ హత్య కేసులో అతియన్ ఒక అమాయకుడిని ఏ  ఆధారాలతో  చంపాడు ?, చివరకు అసలు హంతకుడిని అతియన్ ఎలా కనిపెట్టాడు ?, ఈ మొత్తం కథలో నటరాజ్ (రానా దగ్గుబాటి ) పాత్ర ఏమిటి ? అనేది కథ.

 ఎక్కువ మార్కులు  :

పవర్‌ ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రజినీ స్టైల్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. అలాగే, రజినీకాంత్ మాస్ అండ్ యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే చెడ్డవాళ్లకి న్యాయపరంగా మాత్రమే, శిక్ష పడాలని భావించే అమితాబ్ బచ్చన్( మానవ హక్కుల పర్యవేక్షక అధికారి ) ఒకవైపు, హద్దులు దాటి అయినా న్యాయం చేయాలని భావించే రజనీకాంత్ పాత్ర మరోవైపు. ఈ రెండు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. అమితాబ్ తన పాత్రలో చాలాబాగా ఒదిగిపోయారు.

రజినీకాంత్ వర్సెస్ రానా దగ్గుబాటి మధ్య సీన్స్ తో పాటు వారి మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. రానా కూడా తన పాత్రలో చాలా బాగా నటించాడు. సెకండ్ హాఫ్ లో రానా పాత్రను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు అతని పాత్ర చాల అద్బుతంగా కనెక్ట్ అయ్యింది.ఇతర ప్రధాన పాత్రల్లో మంజు వారియర్, రితికా సింగ్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అభిరామి, దుషారా విజయన్, రోహిణి, రావు రమేష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

ఓ హత్యతో కథలో సీరియస్ టర్న్ తీసుకుని ఫస్ట్ హాఫ్ ని డ్రైవ్ చేయడం బాగుంది. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి . దర్శకుడు జ్ఞాన్‌వేల్ ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ను కూడా చాల బాగా తీసాడు  .

తక్కువ మార్కులు :

దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తీసుకున్న మెయిన్ పాయింట్, మరియు ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సంఘర్షణ బాగా ఆకట్టుకున్నాయి కానీ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం రొటీన్ స్టైలిష్ నే చూపించిన విధానం  సినిమాకి మైనస్ అయింది. పైగా కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ ల్యాగ్ లేకుండా, ఇంకా ఎమోషనల్ గా ఉండి ఉంటే కాస్త బాగుండేది.

అలాగే, సెకండ్ హాఫ్ లో  కొన్ని రొటీన్  సీన్స్ ను కూడా తగ్గించుకోవాల్సింది. ప్రధానంగా రానా పాత్రను లాజికల్ చూపించినా , ఇంకాస్త బలమైన కాన్సెప్ట్  ను  రాసుకుని ఉండి ఉంటే సినిమాకి ఇంకా బెటర్ గా అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. కథ అనుసారంగా , దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, తో పాటు   ఇన్విస్టిగేషన్ సీన్స్ కాస్త  స్లోగా ఉండటం, అలాగే సెకండాఫ్ ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలాన్ని ఇవ్వలేకపోయాయి .

 సాంకేతిక పరమైన విభాగం :

ఇక సాంకేతిక విభాగం  గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజిక్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, సెకండ్ హాఫ్ సిన్స్ ను  ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే, సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ కూడా బెటర్ గా అని  పించింది . యాక్షన్ సన్నివేశాలలోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాత ఎ. సుభాస్కరన్ పాటించిన సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 అభిప్రాయం  :

సినిమాని పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాకెజ్  తో పక్కా యాక్షన్  థ్రిల్లర్ క్రైమ్  గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వేట్టయన్సినిమాలో రజనీ స్టైల్ అండ్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. కాకపోతే, కొన్ని రొటీన్ మూవీ సీన్స్ తో బోర్ గా సాగడం, మరియు సెకండాఫ్ ప్లే కొన్ని చోట్ల ఆసక్తికరంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయినప్పటికి . ఓవరాల్ గా, ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు క్రైమ్ యాక్షన్ డ్రామా ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది