Mr Buchchan : Movie Review
విడుదల తేదీ : ఆగస్టు 15, 2024
నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు
దర్శకుడు: హరీశ్ శంకర్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్,
సినిమాటోగ్రఫీ: అయానక బోసే
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా (15-08-2024)న థియేటర్ లోకి ప్రవేశించినది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పింస్తుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
స్టోరీ :
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) అవినీతికి వ్యతిరేకి. నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో, ఆగ్రహించిన పైఅధికారులు మిస్టర్ బచ్చన్ ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వస్తాడు. అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం మిష్టర్ బచ్చన్ ఏమేమిచేశాడు, బచ్చన్ తో జిక్కీ ఎలా ప్రేమలో పడింది మరియు వీరి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసింది?మరియు ఇంతలో బచ్చన్ కి ఉద్యోగంలో చేరమని ఫోన్ రావడంతో , బచ్చన్ తన తదుపరి రైడ్ ఎంపీ అయిన ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో రైడ్ చేయాల్సి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. రైడ్ విషయంలో అధికారులని సైతం భయపెట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు ?, అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ?, చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.
ఎక్కువ మార్కులు :
మిస్టర్ బచ్చన్ గా రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ యాక్షన్ లో మరియు తన లుక్స్ తో రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్ లో భాగ్యశ్రీ బోర్సే ఫేస్ లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి.
విలన్ గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ సత్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో సత్య తన పాత్ర తో ప్రేక్షకులను అలరించాడు . ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి మరియు గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు.మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఒక ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నిజాయితీతో పని చేస్తే. సిస్టమ్ కి ఎంతో మేలు జరుగుతుందని చూపించిన విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మరియు డైరెక్టర్ హరీశ్ శంకర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.
తక్కువ మార్కులు :
మిస్టర్ బచ్చన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న హరీశ్ శంకర్, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య సాగే సన్నీ వేషాలు ఇంకాస్త టఫ్ గా ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.
రవితేజ ఎమోషనల్ పేస్ ను డైరెక్టర్ హరిశంకేర్ చూపించలేకపోయారు
రవితేజ ఇన్ కం టాక్స్ ఆఫ్ఫీసర్ యా క్షన్ బాగున్నా డ్రెస్సింగ్ స్టైల్ కావాలని మిస్ చేసి నట్టు వుంది (ఎందుకో )
ఇన్ కం టాక్స్ ఆఫీసర్ లుకింగ్ గా కనబడలేదు
చివరి కి క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యిందెమో అనిపిస్తుయింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిస్తే బాగుండు అనిపిస్తుంది, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి హరీశ్ శంకర్ డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం పాత్రలకు అనుగుణంగా మలచినప్పటికి . సినిమా మాత్రం ఈగల్ మూవీ యాక్షన్ సీన్స్ మించినట్టు ఉండదు. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి హైలెట్ అయ్యేది .
సాంకేతిక పరమైన విభాగం :
దర్శకుడు హరీశ్ శంకర్ తన డైరెక్షన్ తో మెప్పించినా. మూవీ కి స్టోరీ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారేమో అనిపిస్తుంది . సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగున్నాయ్ . సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే. అక్కడక్కడ ఉన్న కొన్ని సీన్స్ ను సాగథీసినట్టు అనిపిస్తుంది వాటిని ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి తగ్గించాల్సింది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
అభిప్రాయం :
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ యాక్షన్ అండ్ స్టైలిష్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం ప్రేక్షకులను కాస్త ఇబంధిని పెడుతుంది , సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం తో సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.
చివరి పలుకులు : రవితేజ ఎమోషనల్ ఫుల్ ఎంటర్ టైన్ మూవీ (ఈగల్, ధమాక ) చూసినా ప్రేక్షకులకి ఈ మూవీ అంత కిక్ ఇ వ్వ క పోవచ్చు .మూవీ లో రవితేజ డ్రెస్సింగ్ స్టైల్ ఓల్డ్ 20 సం ,, క్రితం డ్రెస్సింగ్ ల వుంది .
రవితేజ ఫాన్స్ (ప్రేక్షకులు ) మూవీ ని ఒక్కసారి ధియేటర్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు
ఓల్డ్ మూవీస్ (ఈగల్, ధమాక ) అంత కిక్ ఇవ్వక పోవచ్చు
