కంగువా మూవీ రివ్యూ
నటీనటులు : సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణ్యం, K. S. రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు.
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: శివ
ఎడిటర్: నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ:
వెట్రి పళనిస్వామి
యాక్షన్: సుప్రీమ్ సుందర్
డైలాగ్స్: మదన్ కార్కే
కథ: శివ, ఆది నారాయణ
పాటలు: వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్
డిజైనర్: అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్: రాజన్
కొరియోగ్రఫీ: శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ జే రాజాఇ
కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్
హీరో సూర్య నటించిన లేటెస్ట్ న్యూ మూవీ ‘కంగువా’ శివ దర్శకత్వంలో భారి
బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నేడు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
స్టొరీ :
ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా
చేసేవాడు). గా పని
చేస్తూ ఉంటాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ కూడా అతనికి పోటీగా మరో బౌంటీ హంటర్ ఎంజెల్ గా ఉంటుంది. అయితే, అలాంటి సమయంలో బ్రెయిన్
ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ అనుకోకుండా గోవాలో కలుస్తాడు. ఆ బాబు ఎవరు ?, ఆ బాబుకి, ఫ్రాన్సిస్‌కి
ఏదో బంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు
వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని వందల ఏళ్ల కిందట
జరిగిన ఆ కథలో కంగువా (సూర్య) ఎవరు ?, కంగువా తెగకి, మిగిలిన
తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి ?, ఈ క్రమంలో కంగువా చేసే
పోరాటాలు ఏమిటి ?, ఫ్రాన్సిస్ గా పుట్టిన కంగువా ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.
ఎక్కువ మార్కులు :
కంగువా, ఫ్రాన్సిస్
పాత్రల్లో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో సూర్య అభినయం
మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. కంగువా తన జాతి కోసం, ఇచ్చిన మాట కోసం
ప్రాణం ఇచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం, నిజంగా చాలా అద్బుతంగా
ఉంది . హీరోయిన్ గా దిశా పటానీ తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ లుక్స్ తో ఆమె యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరియు బాలీవుడ్
నటుడు బాబీ డియోల్ తన పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది.అతడు తన పాత్రలో జీవించాడు.
బాబీ డియోల్ పాత్రను సూర్య పాత్రకు ధీటుగా దర్శకుడు శివ తీర్చిదిద్దారు. నటరాజన్
సుబ్రమణ్యం కూడా చాలా బాగా నటించాడు.ఇతర కీలక పాత్రల్లో కనిపించిన K.S.రవికుమార్, యోగి బాబు,మరియు కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్
తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
అదేవిధంగా అతిథి పాత్రలో
మెరిసిన కార్తీ సినిమాకి మరో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచాడు అనే చెప్పాలి . ఇక మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ
నటనతో మెప్పించారు. క్లైమాక్స్‌లో విజువల్ అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు
యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి హైలెట్. అలాగే ఆ చిన్న బాబుకి – సూర్యకి మధ్య
వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తక్కువ మార్కులు :
‘కంగువా’లో బరువైన ఎమోషన్స్, మరియు
భారీ
విజువల్స్ ఉన్నా. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ పూర్తి
స్థాయిలో ఆకట్టుకోవు.సినిమా లో గతజన్మ ప్రస్తుత జన్మ లో జరిగే సన్నీ వేషాలను
ప్రేక్షకులను కాస్త అర్ధం అయ్యే విధంగా లేవు ఇక దిశా పటానీ – సూర్య పాత్రల మధ్య లవ్ ట్రాక్
కూడా ఇంకాస్ట రొమాంటిక్ గా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.
మొత్తానికి ‘కంగువా’ కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా
కనిపించారు. మరియు యాక్షన్ సన్నివేశాల్లో(ముఖ్యంగా కంగువా
క్లైమాక్స్ లో) మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు శివ,మొదటి అఫ్ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిస్తే
బాగుండు .
సాంకేతిక పరమైన విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక
పరమైన విభాగం గురించి మాట్లాడుకుంటే.సినిమా టోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి వర్క్ చాలా
బాగుంది. సినిమాలోని యాక్షన్ కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా
కథకు అనుగుణంగా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ కూడా చాలా
వరకు బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు బాగానే
ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది.
శివ దర్శకుడిగా రచయితగా ఈ
చిత్రానికి సరియైన న్యాయం చేశారు. నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నో కాంప్రమైజ్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు
బాగున్నాయి.
అభిప్రాయం
:
యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా
వచ్చిన ఈ ‘కంగువా’మూవీ. ప్రేక్షకులకు యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు
కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ముఖ్యంగా సూర్య పవర్ ఫుల్ నటన, క్లైమాక్స్ లో కొంత
సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు మంచి సాంకేతిక విస్జువాల్స్
తోమూవీ ని నడిపించారు. కానీ, రొటీన్ స్క్రీన్
ప్లే తో కొన్ని
సన్నివేశాలు స్లోగా సాగడం వల్ల, లవ్ స్టోరీ లో
రొమాన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల సినిమాకి మైనస్
అయ్యాయి. ఐతే, సూర్య తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్
గా ఈ చిత్రం సూర్య అభిమానులతో పాటు యాక్షన్ ప్రేక్షకులను
ను కూడా అలరిస్తుంది.
చివరగా :
సూర్య నుంచి ఆయన అభిమానులు
ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్
మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’తో సాగింది. ఇక బాలనటులు
కథకు బలమైన పాత్రలుగా నిలిచాయి. మిగితా పాత్రల్లో నటించిన వారాంత
ఫర్వాలేదనిపించారు
.png)