Return of the Dragon movie review

 

         రిటర్న్ అఫ్ ది డ్రాగన్

 


 

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025

నటీనటులు :ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్

దర్శకుడు :: అశ్వత్‌ మారిముత్తు
నిర్మాణం : కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌
సంగీతం :లియోన్‌ జేమ్స్‌
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి

ఎడిటర్ :ప్రదీప్ ఈ రాఘవ్

 

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

ధన్‌పాల్ రాఘవన్ అలియాస్ డీ రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) 12వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. పైగా 96%తో పాస్ అయ్యి, మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటాడు. ఐతే, ఓ అమ్మాయి కారణంగా తాను బ్యాడ్ బాయ్ గా మారతాడు. దాంతో బీటెక్ పూర్తయ్యే సరికి 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు  పడుతాడు.అంతేకాక అదే కాలేజీలో కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు.

చివరికి బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి అమెరికాకు వెళ్లే అవకాశాన్ని అందుకోవడమే కాకుండా సంపన్నురాలైన అమ్మాయి పల్లవి (కాయడు లోహర్) పెళ్లాడే లక్కీ ఛాన్స్‌ను కొట్టేస్తాడు.

ఆ సమయంలోనే   ఓ సంఘటన కారణంగా రాఘవన్ లైఫ్ లోకి అతని కాలేజ్ ప్రిన్సిపాల్ వస్తాడు. ? అసలు కాలేజ్ ప్రిన్సిపాల్ ఎందుకు రాఘవన్ దగ్గరకు వచ్చాడు ? ఇంతకు రాఘవన్ పేరు డ్రాగన్‌గా ఎందుకు మారింది?

రాఘవన్ కి తగిలిన ఊహించని షాక్ ఏమిటి ?చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.


ఎక్కువ మార్కులు :

లవ్ టుడే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు.యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ కథగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎంచుకొన్న పాయింట్ బేసిక్‌గా బాగుంది. లవ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టూడెంట్‌కు చక్కటి మెసేజ్‌తో రాసుకొన్న సన్నివేశాలు సినిమాను మరింత ఫీల్‌గుడ్‌గా మార్చాయి. ఓపెనింగ్ నుంచి హీరో ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.అతని తండ్రి పాత్రలో జార్జ్ మేరియన్ జీవించారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంది. అలాగే కాయదు కూడా గ్లామర్‌తోను అందాల ఆరబోతతో మెరిసారు. అలాగే తన నటనతో అభినయ పాత్రతో మంచి మార్కులే కొట్టాశారు. అదేవిధంగా మిస్కిన్ పాత్రతో పాటు ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి.

సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటన బాగుంది . ఇక చివర్లో లవ్ టుడే ఫేమ్ ఇవానా స్పెషల్ అప్పీరియన్స్‌తో ఆడియెన్స్‌కు జోష్ పుట్టించే పాత్రలో కనిపించారు.

తక్కువ మార్కులు :

డ్రాగన్(ప్రదీప్ రంగనాథన్) పాత్రను, ఆ పాత్ర కు తగినంతగా  సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది.

సినిమా మాత్రం ట్విస్ట్ అండ్ యాక్షన్ సీన్స్  యావరేజ్ గానే అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో  స్క్రీన్ ప్లేతో పాటు ముఖ్య  పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి ఇంకాస్త జోష్ ఉండేది .

 

సాంకేతిక పరమైన విభాగం :

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది టెక్నికల్ విషయాలకు వస్తే. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి, లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ తో జోష్ పుట్టించాడు . సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా నికేత్ బొమ్మి కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు ఈ డబ్బింగ్ సినిమాకు రాసిన సంభాషణలు, సాహిత్యం వల్ల పూర్తిగా తెలుగు సినిమాగా మారిపోయిందనేలా అనిపిస్తుంది. నిర్మాతలు కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

అభి ప్రాయం  :

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌అంటూ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో. మెయిన్ స్టొరీ, కామెడీ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. కాని  రెగ్యులర్ స్టొరీ స్క్రిప్ట్ , సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. లవ్ టుడే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనకు లభించిన చక్కటి పాత్రలో మళ్లీ పరకాయ ప్రవేశం చేశాడు.

 ఓవరాల్ గా కొన్ని యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.చివరగా మూవీ ని ధియేటర్ లో ఒక్కసారి చూడాలని పించేలా కథను నడిపించాడు డైరెక్టర్ గారు యూత్ ఫుల్ బాయ్స్ కి చక్కటి వినోద భరితమైన మూవీ గా  చెప్పవచ్చు .




Movie  link